| 'ఇద్దర్ని పెళ్లి చేసుకోవాలి.. లేదంటే జైలుకే' |
స్వాజిలాండ్‌కు చెందిన రాజు ' ప్రజలకు చిత్రమైన ఆదేశాలు ఇచ్చారు. మేజరైన ప్రతీవ్యక్తి ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మందిని పెళ్లి చేసుకోవాలని.. లేకుంటే జూన్ తర్వాత జైళ్లో పెట్టిస్తానంటూ హుకూం జారీ చేశారు. దేశంలో మగవారి కంటే స్త్రీల సంఖ్యే ఎక్కువ ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. మెస్వాతి-3కి 15మంది భార్యలు, 25మంది పిల్లలు ఉండగా.. ఆయన తండ్రికి 70మంది భార్యలు, 150మందికి పైగా సంతానం ఉన్నారు.