నకిలీలను నమ్మకండి
| Myntra |
Myntra ఉద్యోగాలున్నాయని వచ్చే ఫోన్ కాల్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలని సంస్థ తెలిపింది. ఉద్యోగాలతో పాటు ఆఫర్లున్నాయని, డబ్బులు కడితే ప్రత్యేక డిస్కంట్ల పేరుతో తాము ఎలాంటి కాల్స్ చేయమని సంస్థ ప్రతినిధులు తెలిపారు. ఇలాంటి ప్రకటనల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. ఇటీవల ఈ తరహాలో తమకు కస్టమర్ల నుంచి అనేక ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో మింత్రా ప్రకటన చేసింది.